కాకినాడ అపోలోలో ప్రపంచ కిడ్నీ దినోత్సవం - కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన సదస్సు
కాకినాడ, మార్చి 11,(పిన్ పాయింట్)
ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడలోని అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో కిడ్నీ వ్యాధులపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్. లావణ్య కుమారి విచ్చేసి, జ్యోతి ప్రజ్వలనతో సదస్సును ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ లావణ్య కుమారి మాట్లాడుతూ, ప్రస్తుత జీవనశైలిలో కిడ్నీ వ్యాధులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి బీపీ, షుగర్ నియంత్రణలో ఉండాలని, ముఖ్యంగా ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించాలని ఆమె సూచించారు.
సదస్సులో పాల్గొన్న అపోలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ నిపుణులు డాక్టర్ జి.వి. రావు, డాక్టర్ సిహెచ్. కర్ణాకర్ రెడ్డి, ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ అనిల్ కుమార్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ఏ. గణేష్ పలు కీలక విషయాలను వెల్లడించారు
శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి రక్తాన్ని శుద్ధి చేయడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయని
సరైన ఆహారం, నిత్యం వ్యాయామం, మరియు తగినంత నీరు తాగడం ద్వారా కిడ్నీలను కాపాడుకోవచ్చునని తెలిపారు.హై బీపీ, షుగర్ ఉన్నవారు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ సలహా లేకుండా అనవసరంగా మందులు వాడటం కిడ్నీలకు హానికరమని హెచ్చరించారు.కిడ్నీ వ్యాధులు ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు చూపించవు, కాబట్టి వార్షిక చెకప్‌లు తప్పనిసరి.
రూ. 999లకే కిడ్నీ హెల్త్ చెకప్ ప్యాకేజీ
అపోలో హాస్పిటల్ యూనిట్ హెడ్ డాక్టర్ గణేష్ మాట్లాడుతూ, కిడ్నీ సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజల కోసం రూ. 999లకే కిడ్నీ పనితీరును నిర్ధారించే ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీని ప్రారంభించినట్లు ఆయన ప్రకటించారు.
ప్రజల్లో కిడ్నీ ఆరోగ్యంపై చైతన్యం కల్పించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తే కిడ్నీ వ్యాధులను సమర్థవంతంగా నివారించవచ్చని వైద్య బృందం స్పష్టం చేసింది.



