కాకినాడ, మార్చి 11, (పిన్ పాయింట్) సీనియర్స్ సిటిజన్స్ హక్కులు, సంక్షేమంపై ఏపీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం కాకినాడ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో వర్క్ షాప్ జరిగింది. కాకినాడ ఆర్డీవో ఎస్ మల్లి బాబు.. అధ్యక్షతన జరిగిన ఈ వర్క్ షాప్ లో రాష్ట్ర రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు, ఎల్పేజ్ ఇండియా ఏపీ, తెలంగాణ స్టేట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి.శ్యామ్, ఎల్. సూర్యనారాయణ మూర్తి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై, తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంక్షేమం చట్టం 2007, నియమావళి 204పై కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు అవగాహన కల్పించారు.       ఈ సందర్భంగా ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ.. కాకినాడ డివిజన్ లో సీనియర్ సిటిజన్స్ హక్కులు, సంక్షేమానికి అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందుకు వివిధ శాఖల సమన్వయం చేసుకుంటూ పనిచేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్ర రెడ్ క్రాస్ చైర్మన్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ మెంబర్ వైడి రామారావు మాట్లాడుతూ.. వృద్ధుల పట్ల ప్రభుత్వం మాత్రమే కాకుండా సామాన్య ప్రజలు బాధ్యతగా వ్యవహరిం చాలన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ ద్వారా వృద్ధులకు వివిధ సహాయ, సహకారాలు అందిస్తున్నామని, కాకినాడ రెడ్ క్రాస్ సంస్థ ద్వారా క్యాన్సర్ చికిత్సకు రూ.8 కోట్ల వ్యయంతో ప్రత్యేక ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఒక ఆశ్రమం కూడా నడుపుతున్నామన్నారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా సీనియర్ సిటిజన్స్ మేనేజర్ కె. మదన్మోహన్ రెడ్డి వృద్ధుల యొక్క హక్కులు, బాధ్యతలు, సంక్షేమం, వృద్ధుల సమస్యల పరిష్కారం మార్గాలపై చర్చించారు.       ఈ వర్క్ షాప్ లో వయోవృద్ధులు సంక్షేమ శాఖ అధికారులు, కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఆర్. సుధాకర్, జి.విశ్వరరావు, జిఎస్వి ప్రసాద్, ఎం. అమ్మాజీ, ఎంవీ. గోపాలరావు, వీఆర్కే. శాస్త్రి, కె. గౌరినాయుడు, కేవీ. రామరాజు తదితరులు హాజరయ్యారు.
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి