కాకినాడలో హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం -పాల్గొన్న ఎంఎల్సీ కర్రీ పద్మశ్రీ.
కాకినాడ,మార్చి 11,(పిన్ పాయింట్)
యువతుల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా భారత ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన హ్యూమన్ పాపిలోమా వైరస్ టీకా కార్యక్రమాన్ని కాకినాడలోని పలు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ఎంఎల్సీ కర్రీ పద్మశ్రీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) నుండి రక్షణ పొందేందుకు ఈ హెచ్‌పీవీ టీకా ఒక బలమైన రక్షణ కవచంలా పనిచేస్తుందని ఆమె పేర్కొన్నారు.
14 నుండి 15 ఏళ్ల లోపు వయస్సున్న బాలికలందరూ ఈ టీకా తీసుకోవడానికి అర్హులని ఆమె తెలిపారు.తల్లులు చొరవ తీసుకుని, తమ కుమార్తెలకు సరైన వయస్సులో ఈ టీకా వేయించి వారి భవిష్యత్తును సురక్షితం చేయాలని సూచించారు.గ్రామీణ మరియు పట్టణ స్థాయిల్లో ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులను, యు పి హెచ్ సి
సిబ్బందిని ఈ సందర్భంగా ఆమె అభినందించారు. ప్రభుత్వ ఉచిత టీకా సౌకర్యాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.



