పారిశుధ్య పనులను పరిశీలించిన అదనపు కమిషనర్ సుధాకర్
కాకినాడ, మార్చి 11,(పిన్ పాయింట్)
కాకినాడ నగరంలో జరుగుతున్న పారిశుధ్య నిర్వహణ పనులను నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కే.టి. సుధాకర్ బుధవారం ఉదయం స్వయంగా పరిశీలించారు. నగరంలోని గైగులపాడు, సర్పవరం జంక్షన్, భానుగుడి సెంటర్ ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య కార్యక్రమాలను ఆయన పరిశీలించి పారిశుద్ధ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు.
పరిశుభ్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, చెత్తను సమయానికి తొలగిస్తూ నగరాన్ని శుభ్రంగా ఉంచాలని పారిశుద్ధ్య కార్మికులకు ఆయన సూచించారు.
అనంతరం అదనపు కమిషనర్ కే.టి. సుధాకర్ అన్నమఘాటి సెంటర్‌లో ఉన్న అన్న క్యాంటీన్‌ను సందర్శించారు. క్యాంటీన్‌కు వచ్చే ప్రజలకు అందిస్తున్న అల్పాహార నాణ్యతను స్వయంగా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం సరైన కొలతలతో, నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ అల్పాహారం అందించాలని క్యాంటీన్ సిబ్బందికి సూచించారు.
ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణంతో పాటు నాణ్యమైన ఆహారం అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.



