కాకినాడ: నగరంలోని 44వ వార్డు మెహెర్ నగర్, ద్వారక నగర్ ప్రాంతాల్లో "మన ఆరోగ్యం - మన చేతుల్లో" కార్యక్రమంలో భాగంగా ఇద్దరు ఆదర్శ మహిళలను గుర్తించి ఘనంగా సత్కరించారు. తంగేటి వరలక్ష్మి, పెంటకోట లక్ష్మి తమ ఇళ్ల వద్ద తడి, పొడి చెత్తను వేరు చేస్తూ, వ్యర్థాలను డ్రైన్లలో వేయకుండా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా.. కూరగాయల వ్యర్థాలు, గుడ్డు పెంకులను మొక్కలకు ఎరువుగా వాడుతూ పర్యావరణంపై మక్కువ చాటుతున్నారు. వీరి నిస్వార్థ సేవలను గుర్తించిన మున్సిపల్ వర్కర్లు, కూటమి నాయకులు వారిని శాలువా, షీల్డ్, మూడు టబ్‌లు మరియు స్వీట్ బాక్సులతో అంగరంగ వైభవంగా సన్మానించారు. పారిశుధ్య కార్మికులతో మంచి సంబంధాలు కలిగి ఉండటం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో వీరు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని అగ్రహారపు సతీష్, నాయకులు కొనియాడారు.
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి