జనసేన సిద్ధాంతాలే ఊపిరిగా సభ్యత్వ నమోదు: ఎమ్మెల్యే నానాజీ
కాకినాడ: జనసేన పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. 'జనసేన ఉద్యమి' కార్యక్రమంలో భాగంగా తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 23 వేలకు పైగా సభ్యత్వాలు పూర్తయ్యాయని, ఈ నెల 17 వరకు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. గత ఏడాది 35 వేల సభ్యత్వాలు నమోదు కాగా, ఈసారి 50 వేల లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఈ నెల 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎండల దృష్ట్యా ఏ మండలానికి ఆ మండలం ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ జనసైనికులు, వీరమహిళలు ఉత్సాహంగా ముందుకు సాగాలని ఆయన కోరారు.



