కాకినాడ: పంబ్లర్స్ డే (Plumbers Day) సందర్భంగా కాకినాడకు చెందిన 'మదర్స్ ప్లంబర్ అసోసియేషన్' సభ్యులు తమ సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని సామాన్యులైనప్పటికీ, సామాజిక బాధ్యతతో ప్రతాప్ నగర్‌లోని జనావళి అనాథాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. గత ఆరేళ్లుగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మాజీ అధ్యక్షుడు లక్ష్మణరావు తెలిపారు. ఆర్థిక స్థోమత తక్కువైనా, కష్టార్జితంలో కొంత భాగాన్ని నిరాధారుల కోసం ఖర్చు చేస్తూ ఈ శ్రమజీవులు అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు వరసాల సతీష్, ఉపాధ్యక్షుడు దుర్గాప్రసాద్ రెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్, ఖజాంచి సురేష్ మరియు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి