మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
కాకినాడ, మార్చి 11,(పిన్ పాయింట్)
మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు.
ప్రధానమంత్రి మత్స్య సంపదన యోజన పథకం ద్వారా సముద్రంలో చేపల వేట చేయు మత్స్యకారులకు సబ్సిడీపై మంజూరి అయిన బోటు ఇంజన్లు మరియు గూడ్స్ ఆటోను బుధవారం జగన్నాధపురం శాసనసభ్యులు స్వగృహం నందు నిర్వహించిన కార్యక్రమంలో శాసనసభ్యులు వనమాడి కొండబాబు, మత్స్యకారు నాయకులు నాగడి నాగేశ్వరరావు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ సముద్రంలో చేపల వేట సాగిస్తూ జీవనం సాగిస్తున్న మత్స్యకారు కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక తోడ్పాటు అందించి వారి ఆర్థిక ఎదుగుదలకు కృషి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, మత్స్యకారులు నూతన సాంకేతిక పరిజ్ఞానమును ఉపయోగించుకొని చేపల ఉత్పత్తిని పెంచి ఆర్థికంగా ఎదగాలనే దృఢ సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య ఉద్దేశ్యమని, దానిలో భాగంగానే నేడు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా 40 % సబ్సిడీపై ఇంజిన్లు మరియు మూడు చక్రాల వాహనం (ఆటో) అందించడం జరిగిందని, కోపనాతి దేవరాజు, వంక రంగరాజు, కోపనాతి రాజు, తెనాలి రమణ లకు సుమారు 1,33,280 రూపాయల విలువ చేసే ఇంజన్ మరియు 3,13,280 విలువచేసే ఆటో రాగిత ఈస్టర్ రాణిలకు అందజేయడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధికారి వి.కృష్ణారావు, మత్స్యశాఖ సహాయ సంచాలకులు K. కరుణాకర్ రావు, ఆప్కాబ్ ఉపాధ్యక్షులు బలసాడి రంగారావు, బోటు ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సంఘాని నాగేశ్వరరావు, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి సి.హెచ్. ఉమామహేశ్వరరావు, మల్లాడి రాజు, రామలింగరాజు, ఎరుపిల్లి రాము, చొక్కా బాబురావు, బడే సత్యరావు, సూరాడ చిన్నారావు, ఎరుపిల్లి సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.



