కాకినాడ, సెప్టెంబర్ 27,(పిన్ పాయింట్) స్థానిక ఎన్‌ఎఫ్‌సీఎల్‌ రోడ్డులోని ఐఎంఏ భవనంలో ఆదివారం కాకినాడ సర్కిల్‌ యూనిట్‌ పవర్‌ డిప్లొమా ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించారు. 2027–2028 రెండేళ్ల కాలానికి సంబంధించి జరిగిన ఎన్నికల్లో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశానికి ఎ. వీరభద్రరావు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. సన్యాసిరావు, ఈపీడిస్కామ్‌ యూనిట్‌ ప్రధాన కార్యదర్శి జి. జోగినాయుడు, పలువురు డిస్కామ్‌ ప్రతినిధులు హాజరయ్యారు. ​నూతన కార్యవర్గానికి ​అధ్యక్షుడుగా ఎ. వీరభద్రరావు,​కార్యదర్శిగా గౌతు రాజు, ​ఆర్గనైజింగ్‌ సెక్రటరీలు గా ఎం. శ్రీనివాస్‌, మహిళా ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా సిహెచ్‌. వాసవి కోశాధికారిగా వి. సుబ్బారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.నూతనంగా ఎన్నికైన ప్రతినిధులకు స్థానిక ఎమ్మెల్యే, ఈఈ జి.వి.ఎల్.ఎన్. శ్రీనివాస్, సూపరింటెండెంట్‌ ఎన్. ఉదయ్‌ భాస్కర్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంక్షేమం, సంస్థ పురోగతికి కొత్త కార్యవర్గం సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఈఈ జి.వి.ఎల్.ఎన్. శ్రీనివాస్‌ను అసోసియేషన్‌ ప్రతినిధులు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిస్కామ్‌ ఇంజనీర్లు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి