​ప్రత్తిపాడు, మార్చి 16: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో పెద్దపులి సంచారం పదిహేడు రోజులుగా కొనసాగుతూనే ఉంది. అటవీశాఖ అధికారులు ఎన్ని బృందాలుగా విడిపోయి గాలించినా, బోన్లు ఏర్పాటు చేసినా పులి మాత్రం చిక్కడం లేదు. తాజాగా శంఖవరం మండలంలో పులి దాడి చేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ​ ​రైతు గేదెపై దాడి: ఆదివారం అర్ధరాత్రి శంఖవరం మండలం మండపం గ్రామం వద్ద పోలం బూరయ్య అనే రైతుకు చెందిన గేదె దూడపై పెద్దపులి దాడి చేసి చంపివేసింది. ​పయనం ఎటు?: ప్రస్తుతం పులి శంఖవరం మండలం G.కొత్తపల్లి పరిసరాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇది అటు నుంచి ప్రత్తిపాడు లేదా రౌతులపూడి మండలాల వైపు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ​హై అలర్ట్: పులి సంచార నేపథ్యంలో శంఖవరం, ప్రత్తిపాడు, రౌతులపూడి మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ​అటవీశాఖ సూచన: రైతులు, కూలీలు ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని, రాత్రి సమయాల్లో ఇళ్ల బయట పడుకోవద్దని అధికారులు కోరుతున్నారు. పులిని పట్టుకునేందుకు అధునాతన కెమెరాలు, డ్రోన్లతో నిఘా పెంచినట్లు తెలిపారు.
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి