అమరావతి: గూగుల్ సంస్థకు భూకేటాయింపులు రద్దు చేయాలంటూ తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే రాష్ట్రానికి కంపెనీలు ఎలా వస్తాయని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రపంచ దేశాలు, పక్క రాష్ట్రాల పోటీని తట్టుకుని పెట్టుబడులు రాబట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, మార్కెట్ ధరకు భూములు ఇస్తామంటే కంపెనీలు దండం పెట్టి వెళ్లిపోతాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఐటీ హబ్ వల్ల భవిష్యత్తులో కలిగే విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. కేవలం ప్రచారం కోసమే ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తూ, దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి