ఢిల్లీలో కూటమి ఎంపీల సందడి.. లోకేష్‌కు ఘన స్వాగతం!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పర్యటిస్తున్న ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూటమి ఎంపీల ఆత్మీయ సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు తన నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు లోకేష్‌తో పాటు కూటమి ఎంపీలందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్మోహన నాయుడు మాతృమూర్తి లోకేష్‌ను ఆశీర్వదించగా, ఆయన పురందరేశ్వరి దీవెనలు కూడా తీసుకున్నారు. విందులో ఎంపీలందరినీ పేరుపేరునా పలకరిస్తూ లోకేష్ ఉత్సాహంగా గడిపారు. ముఖ్యంగా రామ్మోహన నాయుడు పిల్లలను ఎత్తుకుని వారితో సరదాగా ముచ్చటించడం అందరినీ ఆకట్టుకుంది. ఎంపీల మధ్య సాగిన ఈ ఆత్మీయ కలయిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.



