​కాకినాడ, మార్చి 10,(పిన్ పాయింట్) రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి, సంక్షేమం వేగంగా జరుగుతున్నాయని, కూటమి నేతల పరస్పర సహకారం వల్లే ఇది సాధ్యమవుతోందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు. మంగళవారం కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి, రాష్ట్రంలో జరుగుతున్న రెండేళ్ల పాలన ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు రాష్ట్రవ్యాప్తంగా 6 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 15 వేల కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టామని రాజధాని అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. విశాఖ సమిట్ ద్వారా ఉద్యోగాల కల్పనతో పాటు, 16 వేల పోస్టులతో డీఎస్సీ, వందల సంఖ్యలో పోలీసు ఉద్యోగాలను కూటమి ప్రభుత్వం భర్తీ చేస్తోందన్నారు.​జల్ జీవన్ మిషన్ గురించి మాట్లాడుతూ గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు:​కేంద్రం నుంచి విడుదలైన రూ 24,000 కోట్ల నిధుల్లో గత వైసీపీ ప్రభుత్వం కేవలం రూ2,400 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని మండిపడ్డారు. ​నిధులను సకాలంలో వినియోగించుకోకపోవడం వల్ల రాష్ట్రంలో 90 లక్షల గృహాలకు మంచినీటి కనెక్షన్లు ఇవ్వలేకపోయారని పేర్కొన్నారు. ​ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఆ పథకాన్ని పునరుద్ధరించి, పనులు ప్రారంభించామని వెల్లడించారు.​రాష్ట్రంలో మూడో విడత రోడ్ల నిర్మాణం ప్రారంభమైందని, అన్ని వర్గాలకు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని జ్యోతుల ధీమా వ్యక్తం చేశారు. ​ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణ మూర్తి,నురుకుర్తి వెంకటేశ్వర రావు, కటకంశెట్టి బాబి, కొల్లాబత్తుల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ​
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి