తిరుపతి, 2026 మార్చి 10(పిన్ పాయింట్) శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని స్కీంకు రూ.10 లక్షల విరాళం టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని స్కీంకు రూ.10 లక్షల విరాళం అందింది. హైదరాబాద్ కు చెందిన కియోరా ఇఫ్రా కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఎండీ డా. కోడెల శివరామకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ విరాళాన్ని అందించారు. తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్‌లో టిటిడి ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రకు దాత విరాళం డీడీని మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా డా. కోడెల శివరామకృష్ణను టిటిడి ఈవో అభినందించారు.
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి