బ్రేకింగ్ న్యూస్....... కాకినాడ రూరల్ జడ్పీటీసీ బరిలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి
కాకినాడ రూరల్, అక్టోబర్ 27,(పిన్ పాయింట్)
కాకినాడ రూరల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాకినాడ రూరల్ జడ్పీటీసీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి పిల్లి అనంతలక్ష్మి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆమె పేరును ఖరారు చేస్తూ పార్టీ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.
• అధిష్టానం ఆదేశాలతో రంగంలోకి
టీడీపీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌ల మార్గదర్శకత్వంలో, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆదేశాల మేరకు ఆమెను బరిలోకి దించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
నియోజకవర్గంలో పార్టీని విజయపథంలో నడిపించేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విభేదాలు వీడి ఐక్యంగా పనిచేయాలని పార్టీ పిలుపునిచ్చింది.
మాజీ ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలతో ఉన్న సుదీర్ఘ అనుబంధం, బలమైన కేడర్ మద్దతుతో అనంతలక్ష్మి విజయం కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని టీడీపీ శ్రేణులు నిర్ణయించాయి.



