ఏలేరు ఆయకట్టు కింద సాగునీరు పంపిణీని వంతులు వారి విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి.. -ఏలేరు ఆయకట్టు కింద రైతులు అందరి చేత ఆగస్టు15 నాటికి పంటల భీమా కచ్చితంగా నమోదు చేయించాలి.. -వీడియో కాన్ఫరెన్స్ ద
కాకినాడ, ఆగస్టు 1,(పిన్ పాయింట్)
ఏలేరు ఆయకట్టు కింద సాగు నీరు పంపిణీ ని వంతులు వారి విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
శనివారం కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్..రెవెన్యూ, వ్యవసాయం,ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు...
ఏలేరు ఆయకట్టు కింద సాగునీరు పంపిణీని వంతులు వారి విధానం అమలు,అధికారుల బృందం నిత్యం పర్యవేక్షణ,రైతులకు ఎల్ నినో ప్రభావం,సాగునీరు ఎద్దడి,పంటల భీమా నమోదు పై అవగాహన కల్పించడం వంటి అంశాల పై సిబ్బందికి జిల్లా కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మాట్లాడుత.. ఎల్ నినో ప్రభావం,ప్రస్తుత జిల్లాలో సాగునీటి వనరుల లభ్యత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఏలేరు జలాశయం కింద ఉన్న ఆయకట్టుకు అలాంటి సమస్యలు తలెత్తకుండా పంతులు వారి విధానాన్ని అత్యంత కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు.సాగునీరు పంపిణీ వంతుల వారి విధానం పటిష్టంగా అమలయ్యేలా రెవెన్యూ వ్యవసాయం ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని,ఈ బృందంలోని అధికారులు నీటి విడుదల సమయంలో అనధికారికం గా సాగునీరు వినియోగించ కుండా నిత్యం పర్యవేక్షణ చేసి,చివరి పంట భూములకు సజావుగా సాగునీరు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.ఇందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులు సాగునీరుపై కంట్రోల్ రూమ్ నెంబర్ 9849903879 కు ఫోన్ చేసి తమ సమస్యను తెలియపరచవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ప్రధానంగా రైతులందరూ ఖరీఫ్ సీజన్ కుసంబంధించి పంటల బీమా నమోదు చేసుకునేలాచూడాలన్నారుఏలేరు ఆయకట్టు కింద సాగవుతున్న 53 వేల ఎకరాలు పంటల బీమా కింద నమోదయ్యేలా చూడాలన్నారు.ఆగస్టు 15 నాటికి రైతులందరూ తప్పనిసరిగా పంటల బీమా పథకం కింద నమోదు అయ్యేలా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఎల్ నినో ప్రభావం,పంటల భీమా నమోదు,రైతులను ఆరుతడి పంటలవైపు ప్రోత్సహించడం వంటి అంశాలపై రైతు సేవా కేంద్రం స్థాయిలో సాగునీటి సంఘాలు,రైతు సంఘాల నాయకులతో సమావేశాలు నిర్వహించి రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కాకినాడ ఆర్డీవో ఎస్. మల్లిబాబు,వ్యవసాయ శాఖ అధికారి కె. రాబర్ట్ పాల్,ఇరిగేషన్ ఈఈ శేషగిరిరావు,డీఈ రవి కుమార్,ఎల్డీఎం సీహెచ్ఎస్వీ ప్రసాద్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.



