హైదరాబాద్: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఇప్పుడు హైదరాబాద్ వాసుల కడుపు కొడుతోంది. యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగడంతో నగరంలోని ఐటీ కారిడార్ హోటళ్లు, హాస్టళ్లు, మెస్‌లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వండటానికి ఎక్కువ సమయం, గ్యాస్ ఖర్చయ్యే దోశ, పూరి, చపాతీ వంటి ఐటమ్స్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హోటళ్ల అసోసియేషన్ ప్రకటించింది. గ్యాస్ ఆదా చేసేందుకు కేవలం అన్నం, పప్పు, సాంబార్ వంటి తక్కువ సమయంలో పూర్తయ్యే వంటకాలకే పరిమితమవుతున్నారు. మరోవైపు రవాణా భారంతో మరికొన్ని హోటళ్లు టిఫిన్లపై రూ.10 నుండి రూ.15 వరకు ధరలు పెంచేశాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే రెండు మూడు రోజుల్లో హాస్టళ్లను తాత్కాలికంగా మూసివేయక తప్పదని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి