దేశంలో పెట్రోల్ కొరత లేదు: కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన!
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, గ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం దేశంలో ఎలాంటి పెట్రోల్ కొరత లేదని, సరఫరా సజావుగానే సాగుతోందని వెల్లడించింది. హర్మూజ్ జలసంధిపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు దిగుమతులు చేసుకుంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం అవసరమైన ముడి చమురులో 75 శాతం దిగుమతి చేసుకుంటున్నామని, LPG ఉత్పత్తిని కూడా 25 శాతం పెంచినట్లు కేంద్రం పేర్కొంది. అలాగే LNG కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే రెండు భారీ గ్యాస్ షిప్‌లు భారత్‌కు చేరుకోనున్నాయని భరోసా ఇచ్చింది. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.



