తుఫాన్ హెచ్చరికలు నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. - ఆర్డీవో ఎస్. మల్లిబాబు
కాకినాడ, అక్టోబర్ 25,(పిన్ పాయింట్)
ఆర్నాబ్ తుఫాన్ హెచ్చరిక లు నేపథ్యంలో కాకినాడ రెవెన్యూ డివిజనల్ అధికారి. ఎస్ మల్లిబాబు తహసీల్దార్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 27 28వ తేదీ నాటికి తుఫాను తీవ్ర రూపం దాల్చి కాకినాడ వద్ద తీరం దాటవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ పంచాయతీ పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి గ్రామస్థాయిలో ప్రజానీకాన్ని ఎప్పటికప్పుడు చేయాలని ముఖ్యంగా తీర ప్రాంతం మండలాలైన ఉప్పాడ, కొత్తపల్లి. కాకినాడ రూరల్. కాకినాడ అర్బన్ మరియు కరప తాళ్ళరేవు మండలాల్లో సిబ్బంది కంట్రోల్ రూమ్ ఓపెన్ చేసి నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యంగా ఈదురు గాలులకు చెట్లు విరిగిన నేపథ్యంలో అవసరమైన రంపం మిషన్లు అగ్నిమాపక సిబ్బంది వద్ద అందుబాటులో ఉంచడమైనదని. ముఖ్యంగా త్రాగునీరు ఆసుపత్రులు మొబైల్ టవర్లకు అవసరమైన చమురు నిలవలు సిద్ధం చేసుకోవాలని, మండలాల్లో గల ప్రభుత్వ స్కూళ్లను తమ ఆధీనంలోకి తీసుకోవాలని ఆదేశించారు.
ఆహారం. త్రాగునీరు విద్యుత్ సౌకర్యాలకు ఆటంకం లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ఎటువంటి విపత్కర పరిస్థితి నైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.



