ఎంపీటీసీ నామినేషన్లకు భారీ పోలీస్ బందోబస్తు -గురువారం ప్రశాంతంగా ముగిసిన ప్రక్రియ
కాకినాడ రూరల్, అక్టోబర్ 22(పిన్ పాయింట్)
స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో పూర్తయింది.
సి.ఐ. సి హెచ్ ప్రకాష్ పర్యవేక్షణలో పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎస్సైలు ఏసుబాబు, గణేష్ కుమార్, వీరబాబులతో పాటు పోలీస్ సిబ్బంది ఉదయం నుంచే కార్యాలయ ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు, వారి మద్దతుదారులు భారీగా తరలివచ్చిన నేపథ్యంలో ఎలాంటి తోపులాటలు, ఘర్షణలు తలెత్తకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి క్రమబద్ధీకరించారు.ఉదయం ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ముగిసేవరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి బందోబస్తు నిర్వహించడంతో ప్రక్రియ సజావుగా సాగింది.ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించి, శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించినందుకు అధికారులకు, ప్రజలకు పోలీస్ యంత్రాంగం ధన్యవాదాలు తెలిపింది.



