జల జీవన్ మిషన్‌తో గ్రామాలకు జీవనాడి.సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం
జల జీవన్ మిషన్‌తో గ్రామాలకు జీవనాడి
-రూ.34.30 లక్షలతో మంచినీరు వాటర్ ట్యాంక్ -నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం
కె గంగవరం, మార్చి 10,(పిన్ పాయింట్)
రామచంద్రపురం నియోజకవర్గం కె .గంగవరం మండలం శివల గ్రామంలో జల జీవన్ మిషన్ పథకం కింద రూ. 34.30 లక్షలతో 40 వేల లీటర్ల నీటి సామర్థ్యంతో నిర్మించనున్న వాటర్ ట్యాంక్‌కు కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం మంగళవారం శంకుస్థాపన చేశారు. మండల ప్రజా పరిషత్ అధికారి ఎం. శ్రీనివాస్, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ రామారావు, స్వచ్ఛ ఆంధ్ర డైరెక్టర్ సలాది రమేష్, కూటమి పార్టీ నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ ప్రతి గ్రామానికి సురక్షిత తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. జల జీవన్ మిషన్ పథకం గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే మహత్తర కార్యక్రమమని అన్నారు. శివల గ్రామంలో నిర్మించబోయే ఈ వాటర్ ట్యాంక్ పూర్తయిన తర్వాత గ్రామ ప్రజలకు శుద్ధమైన, సురక్షితమైన తాగునీరు అందుబాటులోకి వచ్చి ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడుతుందని పేర్కొన్నారు.
గ్రామాభివృద్ధి కోసం మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రత్యేక దృష్టి సారి స్తున్నారని , ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని నాణ్యతతో, వేగంగా పూర్తి చేసి త్వరితగతిన ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్, పంచాయతీ అధికారులు, డీసీ నిడదవోలు సుబ్రహ్మణ్యం, నియోజకవర్గ రైతు అధ్యక్షులు బలుసు శివప్రసాద్, బీసీ సెల్ మండల అధ్యక్షులు వాసంశెట్టి నాగేంద్ర, ఎంపీటీసీ వాసంశెట్టి నాగమణి, నిడదవోలు రవి, కాకి అప్పారావు, కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

