భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే ఆత్మీయప్రయాణమే పర్యాటకం -శాసనమండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ
కాకినాడ శిల్పారామం లో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు
కాకినాడ, సెప్టెంబర్ 27,(పిన్ పాయింట్ ప్రతినిధి)
భారతీయ సంస్కృతి, సంప్ర దాయాల వైభవానికి అద్దం పట్టే ఆత్మీయ ప్రయాణమే పర్యాటక మని శాసన మండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ పేర్కొన్నారు.
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించు కుని ఆదివారం స్థానిక శిల్పా రామంలో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో “టూరిజం విత్ ఏఐ టెక్నాలజీ – బెటర్ టూ రిజం, మంచి భవిష్యత్తు” అనే థీమ్‌తో “ఎక్స్ప్లోర్ కాకినాడ” కార్యక్రమాన్ని ఉత్సాహ భరిత వాతావరణంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ.. పర్యాటకం కేవలం ప్రయాణాలు,సందర్శనీయ ప్రాంతాల సందర్శనకే పరిమితం కాదని,వివిధ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు,జీవన విధానాలను తెలుసుకునే ఆత్మీయ అనుభూతి అన్నారు.
భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తోందని,దేశ సంస్కృతి,సంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థలోని విలువలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. భారతీయ విభిన్నసంస్కృతి సంప్రదాయాలను అందరికీ పరిచయం చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశమన్నారు.
విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య రూపకాలు,వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని ఎమ్మెల్సీ ప్రశంసించారు. చిన్నారులను సంప్రదాయ కళలు,నృత్యం,సంగీతం వంటి రంగాల్లో పాల్గొనేలా తల్లిదండ్రులుప్రోత్సహించాలని సూచిం చారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్య మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వం లో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత వినూత్నం గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.
జిల్లా పర్యాటక అధికారి వి.వి.వి.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ...కాకినాడ జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. చారిత్రక దేవాలయాలు,ఉప్పాడ చేనేత కళలు,హస్తకళలు, స్థానిక సంస్కృతి ప్రత్యేక ఆకర్షణలుగా ఉన్నాయని పేర్కొన్నారు.
కాకినాడ లోని ఎన్టీఆర్ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ సాధించే దిశగా నెదర్లాండ్స్ కు చెందిన సంస్థ కృషి చేస్తోందని తెలిపారు. హోప్ ఐలాండ్,మడ అడవుల సహజ సిద్ధమైన వాతావరణాన్ని వినియోగిం చుకుని పర్యావరణహిత బోటు సర్వీసులు,వీకెండ్ టూరిజం వంటి కార్య క్రమాలను అందుబాటు లోకి తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇటీవల కాకినాడ జిల్లాను సందర్శించిన కేంద్ర పర్యాటక శాఖ బృందం కూడా జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి అనుకూల అవకాశాలను పరిశీలించి మద్దతు తెలిపినట్లు వెల్ల డించారు.ప్రపంచ పర్యాటక దినోత్సవంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన,వక్తృత్వం, సాంస్కృతిక పోటీలు నిర్వహించారు.
పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ చేతుల మీదుగా ప్రథమ, ద్వితీ య, తృతీయ బహుమతులు అందించి,సన్మానం చేసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పర్యాటక అధికారి వాసం శెట్టి త్రిమూర్తులు,శిల్పా రామం ఏఓ మోహన తేజ, శిల్పారామం సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదం డ్రులు తదితరులు పాల్గొన్నారు.



