కాకినాడ రూరల్, ఆగస్టు 11,(పిన్ పాయింట్) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మెల్లమెల్లగా తన సామాజిక బాధ్యతల నుంచి తప్పుకుంటోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి తీవ్రస్థాయిలో ఆరోపించారు. మంగళవారం కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.సామాన్యులకు ప్రాథమిక అవసరాలైన విద్య, వైద్యం, తాగునీరు, రవాణాతో పాటు వ్యవసాయం, నీటిపారుదల, రోడ్లు వంటి 16 కీలక రంగాలను పిపిపి విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని విమర్శించారు. సోమవారం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి విడుదల చేసిన ఉత్తర్వులు దీనికి నిదర్శనమన్నారు.ప్రైవేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు వడ్డీ లేని రుణాలు అందించేలా ఈ కొత్త స్కీమ్‌ను తీసుకువచ్చారని ఆరోపించారు.వ్యాపార సంస్థలు తమ ఇష్టారీతిన యూజర్ ఛార్జీలను సవరించుకునే వెసులుబాటు కల్పించి, ప్రజలపై తీరని ఆర్థిక భారాన్ని మోపుతున్నారన్నారు.​అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. వాటిని నెరవేర్చలేక ప్రజల నెత్తిన భారం వేస్తున్నారని మండిపడ్డారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో పంచభూతాలను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తారని, సామాన్యులకు విద్య, వైద్యం అందని ద్రాక్షలా మారుతాయని నాగమణి ఆందోళన వ్యక్తం చేశారు.
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి