కాకినాడ జిల్లా పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా మరియు సమాజంలో ప్రశాంత వాతావరణాన్ని పెంపొందించే లక్ష్యంతో కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్., ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు స్థానిక రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్ల ప్రవర్తన, ప్రస్తుత జీవన విధానం మరియు వారి కదలికలను క్షుణ్ణంగా సమీక్షించిన అధికారులు, ఎవరైనా తిరిగి చట్టవ్యతిరేక లేదా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించినా వారిపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి