• కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన అంతా మిధ్య.. • ప్రజలకు చేసిన మోసం పై జగన్ పోరాడితే.. జగన్ ను దూషించేందుకు తిరుపతి సభ.. • ఏపికి జరిగిన అన్యాయం పై రోజంతా మాట్లాడిన సరిపోదు.. కాకినాడ జూన్ 15 :(పిన్ పాయింట్) సూపర్ సిక్స్ పథకాలు పక్కాగా అమలు చేస్తామని గద్దెనెక్కిన చంద్రబాబు దగాకి వారంటీగా నిలుస్తారే తప్ప ఆయన ఇచ్చిన హామీలకు గ్యారంటీ లేదని విమర్శించారు వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ గడచిన రెండేళ్లలో నమ్మిన ప్రజలను కూటమి ప్రభుత్వం ఎలా నట్టేట ముంచిందో వివరించారు. విద్యా సంవత్సరం ప్రారంభం అయినా ఇప్పటి వరకు తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం సొమ్ములు జమ కాలేదన్నారు. రెండేళ్ల పాలనపై తిరుపతిలో నిర్వహించిన సభలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతారని అంతా ఎదురు చూసారని తెలిపారు. అయితే కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ను విమర్శించేందుకే ఎక్కవగా మొగ్గు చూపించడం స్పష్టంగా కనిపించిందన్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలకు పేర్లు మార్చి ప్రజలను ఏమార్చడం మినహా కూటమి ప్రభుత్వం పెద్దగా సాధించింది ఏమీ లేదన్నారు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు కూటమి పాలకులు నానా తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేసారు నాగమణి. రాష్ట్రంలో ప్రతీ ఆడబిడ్డకు ఇస్తానన్న హామీ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఆర్భాటంగా ప్రకటించి ఇప్పుడు తోకముడిచిన చందంగా ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. రైతన్నలకు ఇన్ పుట్ సబ్సిడీ మొదలు, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకు రుణాలు, బిసిలకు 50 ఏళ్లకే పెన్షన్, నిరుద్యోగ భృతి ఇలాంటి ఏ పథకం పైనా ప్రభుత్వం నోర మెదపడం లేదన్నారు. ఇలా ప్రతీ విషయంలో ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందన్నారు. అన్ని పథకాలు ఇచ్చేసామని చెబుతున్న ప్రభుత్వం ప్రజలు నుంచి మాత్రం లేదు.. లేదు అన్న సమాధానం వస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ఇన్ని వైఫల్యాలను పెట్టుకుని జగన్ నామస్మరణతో కాలయాపన చేస్తుందన్నారు. తిరుపతిలో నిర్వహించిన సభలో గడచిన రెండేళ్లలో ప్రజలకు చేసిన ఒక్క మంచి పని గురించైనా గుండెలపై చేయి వేసుకుని చెప్పారా అని ప్రశ్నించారు. ప్రజలను ఎల్లప్పుడూ మోసం చేయడం సాధ్యం కాదని చంద్రబాబు గ్రహించాలని హితవు పలికారు. రానున్న రోజుల్లో మహిళా శక్తి ఏంటో చూపించి తీరతామని స్పష్టం చేసారు నాగమణి..
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి