ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్..*
కాకినాడ, ఏప్రిల్ 28,(పిన్ పాయింట్
కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్దనున్న ఈవీఎం, వీవీపాట్స్ గోదామును మంగళవారం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్.. జిల్లా రెవెన్యూ అధికారి డా.టి.తిప్పేనాయక్ ఇతర రెవిన్యూ, ఎన్నికలు, పోలీస్ శాఖల అధికారులతో కలిసి తనిఖీ చేశారు.
ఈవీఎం, వీవీపాట్స్ గోదాము భద్రతకు చేపడుతున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈవీఎం, వీవీపాట్స్ భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని రెవెన్యూ,ఎన్నికల శాఖల అధికారులను ఆదేశించారు. ఈవీఎం గోదాము పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని అధికారులకు సూచించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెల ఈవీఎం గోదామును తనిఖీ చేసి, నివేదిక పంపిస్తున్నామన్నారు.
ఈ పరిశీలనలో ఆయన వెంట వెంట కాకినాడ ఆర్డీవో ఎస్ మల్లి బాబు, కాకినాడ పట్టణ తహసీల్దార్ వి. జితేంద్ర, కలెక్టరేట్ ఎన్నికల విభాగం డీటి ఎం.జగన్నాథం ఇతర అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



