​కాకినాడ రూరల్, మార్చి 26: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా కాకినాడలో వై ఎస్ ఆర్ సి పి  ఉత్తరాంధ్ర కన్వీనర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్వగృహంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో అంబటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమరశంఖం పూరించారు. ప్రాణాలు తెగించి అయినా సరే ప్రజల పక్షాన పోరాడుతామని, ఎటువంటి బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ​​ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రతి ఒక్కరి హక్కు అని, అయితే ఒక బాధ్యతాయుతమైన నాయకుడి నివాసంపై దాడి చేయడం ఏ రకమైన పాలనకు నిదర్శనమని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన గతంలో తన ఇంటిపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.నా ఇంటి ముందు దాదాపు ఏడు గంటల 20 నిమిషాల దాడులు చేస్తూ  పెట్రోల్ పోసి తగలబెడుతుంటే, కార్ల అద్దాలు పగలగొడుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని,దాడులు చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి, బాధితుడైన నన్ను వేధించడం దారుణమన్నారు.చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే కస్టడీలో తనపై దాడి చేయటం హేయమైన చర్య అని, ఇది ముమ్మాటికీ కక్షపూరిత రాజకీయమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై దాడి చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేసి ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలని హితవు పలికారు. ​"రెడ్ బుక్ చూసి నా ఇంట్లోని కుక్క కూడా భయపడదు అని 40 శాతం ఓటు బ్యాంకు కలిగిన బలమైన పక్షం మాది. అని ప్రజా బలం కల్గిన నాయకుడు తమ నాయకుడు జగన్ అని అన్నారు. ఇటువంటి చిల్లర బెదిరింపులకు వైఎస్సార్సీపీ భయపడదన్నారు. ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే ప్రజల్లో ప్రభుత్వంపై పూర్తిస్థాయి వ్యతిరేకత మొదలైందని, అది త్వరలోనే బహిర్గతమవుతుందని హెచ్చరించారు.రాష్ట్ర సంపదను దోచుకుని పక్క రాష్ట్రాల్లో దాచుకుంటున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు.రాష్ట్రంలో సంపాదించిన ప్రజా ధనాన్ని హైదరాబాద్‌ వంటి నగరాల్లో పెట్టుబడులుగా చంద్రబాబు, లోకేష్ మారుస్తున్నారని విమర్శించారు. అక్రమ సంపాదనతో సామ్రాజ్యాలు నిర్మించుకోవాలని కొందరు చూస్తున్నారని, దీనిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.ముందు నా ఇంటిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని చట్టం అందరికీ ఒకటేనని నిరూపించాలని అప్పుడు మాత్రమే మీరు న్యాయం గురించి మాట్లాడే అర్హత పొందుతారనీ ప్రభుత్వంపై మండిపడ్డారు.ఈ పర్యటన ద్వారా అంబటి రాంబాబు కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. అణచివేత ధోరణి పెరిగే కొద్దీ తమ పోరాటం మరింత ఉధృతమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, ప్రజాక్షేత్రంలోనే అన్ని విషయాలను తేల్చుకుంటామని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, కురసాల కన్నబాబు, జడ్పిటిసి మురుకుర్తి కిట్టు, వైఎస్ఆర్సిపి మహిళా విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జమ్మలమడక నాగమణి, వైసిపి మహిళా నాయకులు వర్ధనీడి సుజాత, పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ​
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి