సుప్రీం సంచలన తీర్పు: కారుణ్య మరణానికి గ్రీన్ సిగ్నల్!
న్యూఢిల్లీ: గత 13 ఏళ్లుగా అచేతన స్థితిలో మంచానికే పరిమితమైన 30 ఏళ్ల యువకుడు హరీశ్ రాణా కారుణ్య మరణం పిటిషన్‌పై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 2013లో జరిగిన ప్రమాదం కారణంగా అప్పటి నుంచి కోమాలోనే ఉన్న హరీశ్ రాణా, తిరిగి కోలుకునే అవకాశాలు ఏమాత్రం లేవని వైద్య నిపుణుల బృందం స్పష్టం చేసింది. తన కుమారుడి దైన్య స్థితిని చూడలేక, గౌరవంగా మరణించే హక్కు కల్పించాలని కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం, హరీశ్ రాణాకు అందుతున్న చికిత్సను నిలిపివేసేందుకు అనుమతినిస్తూ కారుణ్య మరణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

