​ఎమ్మెల్యే పంతం నానాజీని కలిసిన నూతన ప్రజాప్రతినిధి • ​ఇండిపెండెంట్ అభ్యర్థిగానే కొనసాగుతానని స్పష్టీకరణ ​కాకినాడ రూరల్, కరప, అక్టోబర్ 31(పిన్ పాయింట్) కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం నడకుదురు గ్రామ ఎంపీటీసీ–2 స్థానానికి గోమాడ ఏసుబాబు గ్రామ పెద్దల ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలనే సంకల్పంతో ఆయన స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ​ఈ సందర్భంగా గోమాడ ఏసుబాబు మాట్లాడుతూ..తనపై సంపూర్ణ విశ్వాసంతో ఎంపీటీసీ–2గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ పెద్దల నమ్మకాన్ని, గౌరవాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా నిబద్ధతతో ప్రజలకు సేవ చేస్తానని హామీ ఇచ్చారు.గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, పెద్దల సహకారంతో నడకుదురును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.రాజకీయాలకు అతీతంగా తాను స్వతంత్ర (ఇండిపెండెంట్) అభ్యర్థిగానే కొనసాగుతూ గ్రామాభివృద్ధికి నిరంతరం పాటుపడతానని స్పష్టం చేశారు.
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి