డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి - మాజీ మంత్రి కురసాల డిమాండ్
-విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి
-ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసి, నిరుద్యోగ భృతి రూ 3,000 వెంటనే అందించాలి
-సర్పవరం జంక్షన్ వద్ద హోరెత్తిన రిలే నిరాహార దీక్ష
కాకినాడ రూరల్, ఆగస్టు 6,(పిన్ పాయింట్)
రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో తీవ్రస్థాయిలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని, వీటిపై తక్షణమే కేంద్ర దర్యాప్తు సంస్థ సి బి ఐ చేత సమగ్ర విచారణ జరిపించాలని వై ఎస్ ఆర్ సి పి
ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్, కాకినాడ రూరల్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు.
ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు, ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు నెలనెలా రూ 3,000 ల నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ రిలే నిరాహార దీక్ష చేపట్టారు.ఈ దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.లక్షలాది మంది నిరుద్యోగ యువత ఎంతో ఆశతో రాసిన డీఎస్సీ పరీక్ష నిర్వహణలో పారదర్శకత లోపించిందని, అర్హులైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వం తప్పు చేయకపోతే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతోందో సమాధానం చెప్పాలన్నారు.విద్యాశాఖను సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమై, విద్యార్థుల, నిరుద్యోగుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవి నుంచి తప్పుకోవాలని స్పష్టం చేశారు. పేద విద్యార్థుల చదువులకు ఆసరాగా నిలిచే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను నిలిపివేసి కళాశాలలు, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, బకాయిపడ్డ నిధులను వెంటనే ఖాతాల్లో జమ చేయాలని కోరారు.
ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 చొప్పున బాకీ పడ్డ భృతిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని కన్నబాబు హెచ్చరించారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఉద్ఘాటించారు.
ఈ రిలే నిరాహార దీక్షలో కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన పలువురు పార్టీ ముఖ్య నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల నాయకులు, విద్యార్థి-యువజన సంఘాల ప్రతినిధులు, పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత పాల్గొని తమ మద్దతు తెలిపారు. శిబిరం వద్ద కూటమి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సర్పవరం జంక్షన్ హోరెత్తింది.
-విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి
-ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసి, నిరుద్యోగ భృతి రూ 3,000 వెంటనే అందించాలి
-సర్పవరం జంక్షన్ వద్ద హోరెత్తిన రిలే నిరాహార దీక్ష
కాకినాడ రూరల్, ఆగస్టు 6,(ఈవేళ న్యూస్)