డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం జరగదు: ప్రధాని మోదీ భరోసా!
న్యూఢిల్లీ: పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో వ్యక్తమవుతున్న ఆందోళనలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టతనిచ్చారు. నియోజకవర్గాల విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని, లోక్‌సభ సీట్లు తగ్గిపోతాయనే ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన తేల్చి చెప్పారు. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలు నష్టపోతాయన్నది కేవలం అపోహ మాత్రమేనని, జనాభా ప్రాతిపదికన సీట్లు తగ్గుతాయన్న వార్తలు అబద్ధమని కొట్టిపారేశారు. దేశ సమగ్రతను, అన్ని ప్రాంతాల సమాన ప్రాతినిధ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ ప్రక్రియ ఉంటుందని, ఏ ఒక్క రాష్ట్రం కూడా ప్రాధాన్యతను కోల్పోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మోదీ భరోసా ఇచ్చారు. ఈ అంశంపై రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


