పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గింపు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఇంధన ధరల ఒడిదుడుకుల నేపథ్యంలో సామాన్యులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు పెట్రోల్‌పై రూ. 13గా ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని ఏకంగా రూ. 3లకు తగ్గించగా, డీజిల్‌పై ఉన్న సుంకాన్ని పూర్తిగా (Nil) ఎత్తివేసింది. కేంద్రం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు సుమారు రూ. 10 మేర తగ్గే అవకాశం ఉంది. గ్లోబల్ ఎనర్జీ సంక్షోభం కారణంగా పెరుగుతున్న రవాణా ఖర్చులను నియంత్రించి, ద్రవ్యోల్బణం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఈ తగ్గింపు తక్షణమే అమలులోకి రానుండటంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


